కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చా.. నాకెందుకు ఓటెయ్యరు: వినోద్ కుమార్

కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చా.. నాకెందుకు ఓటెయ్యరు: వినోద్ కుమార్

అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలు పెడుతోంది. మంగళవారం(మార్చి 12) కరీంనగర్‌ గడ్డపై కదనభేరి సభ నిర్వహిస్తోంది. ఈ సభలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్‌ ప్రజలను తనకెందుకు ఓటెయ్యరని ప్రశ్నించారు. 

పార్లమెంటులో కొట్లాడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చా, కొత్తపల్లి- మవోహరాబాద్ రైల్వే లైన్ సాధించా, తెలంగాణ కోసం కొట్లాడినా.. నాకు మీరు ఎందుకు ఓటేయరు అని మాజీ ఎంపీ ఓటర్లను ప్రశ్నించారు. గులాబీ జెండా పార్లమెంటులో ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయయని ఆయన అన్నారు.

"కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చా, కొత్తపల్లి- మవోహరాబాద్ రైల్వే లైన్ సాధించా, తెలంగాణ కోసం కొట్లాడిన.. నాకు మీరు ఎందుకు ఓటేయరు. ఉపాధిహామీ నిధులు చట్టప్రకారం అందరికీ వస్తాయి. బండి సంజయ్ నేనే తెచ్చానని చెప్పుకుంటున్నాడు. ఎమ్మెల్యేగాఓడినోడు ఎంపీగా ఎందుకొస్తున్నడు. ఇదేమైన పునరావాస కేంద్రమా?. కావాలంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోదునా..?, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మార్పు కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వంలో జనంలో పంటలు ఎండిపోయి ఏడుస్తున్నారు. మళ్లీ కేసీఆర్ గెలిచుంటే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు చేసి ఉండేవారు.." అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు.