భారత జట్టు పాకిస్థాన్ కు వచ్చేలా ఐసీసీ చూడాలి: జావేద్ మియాందాద్

భారత జట్టు పాకిస్థాన్ కు వచ్చేలా ఐసీసీ చూడాలి: జావేద్ మియాందాద్

ఆసియా కప్ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వాస్తవానికి ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా పాక్ లో టోర్నీ నిర్వహిస్తే తాము ఆడబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశంలోనే ఆసియా కప్ ను నిర్వహించాలని విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ఒకవేళ వేదికను మారుస్తే భారత్ లో జరగబోయే వరల్డ్ కప్ ను తాము బాయ్ కాట్ చేస్తామని పాక్ హెచ్చరించింది. ఈ  తరుణంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ భారత్‌పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.  భారత జట్టు పాకిస్థాన్ కు వచ్చేలా ఐసీసీ చూడాలన్నారు.  బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలకమండలిగా ఐసీసీ  ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించాడు. . ప్రతి జట్టుకు ఒకే విధమైన నిబంధనలను అమలు చేయాలన్నారు.  నియమాలు పాటించని బీసీసీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని జావేద్ డిమాండ్ చేశాడు. పాకిస్తాన్‌లో భారత్ ఓడిపోతే అక్కడి ప్రజలు సహించరంటూ జావేద్  కీలక వ్యాఖ్యలు చేశాడు.