రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్‌ఘడ్‌ జిల్లాలో సూర్యనది వంతెనపై డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే సైరస్ మృతిచెందారు. కారు డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 

ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2006లో టాటా గ్రూప్‌లో సభ్యుడిగా సైరస్ మిస్త్రీ చేరారు.  2012-2016 వరకు టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.