పరీక్షల ఫీజు మాఫీ చేస్తాం: రాహుల్

పరీక్షల ఫీజు మాఫీ చేస్తాం: రాహుల్

త్వరలో జరగనున్నసార్వత్రిక ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగులకు తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలాగే ‘రైట్ టు హెల్త్’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి, దానికోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తామని రాహుల్ పోస్టులో  తెలిపారు.