లీడర్లకు లిక్కర్​ తిప్పలు .. ఆఫ్​టేక్​పై స్లాబ్ విధించిన ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్

లీడర్లకు లిక్కర్​ తిప్పలు .. ఆఫ్​టేక్​పై స్లాబ్ విధించిన ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్

నాగర్​కర్నూల్, వెలుగు: ఎలక్షన్ల టైమ్​లో లిక్కర్​ దొరకక జనాలు తండ్లాడుతున్నారు. ఆఫ్​ టేక్​పై స్లాబ్​ పెట్టడంతో ప్రతి షాపుకు రోజుకు 100 కాటన్లకు మించి మందు ఇవ్వడం లేదు. మందు సప్లై లేక వైన్​షాపులు కళ తప్పుతున్నాయి. కొన్నిచోట్ల షాపులు మూసేస్తున్నారు. ఇక షాపుల పేరిట డీడీలు కడుతుండగా మెయిన్​ పార్టీ లీడర్లు డైరెక్ట్​గా డంప్​ చేయిస్తూ ఇతర పార్టీలకు లిక్కర్​ దొరకకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నెలతో ముగియనున్న గడువు..

జిల్లాలోని వైన్​ షాపులకు ఏటా లిక్కర్​ కోటా ఫిక్స్​ చేస్తారు. ప్రతి ఏడాది 20శాతం సేల్స్​ పెంచాలని అగ్రిమెంట్​లో ఉంటుంది. దానికి అనుగుణంగా లిక్కర్​ సేల్స్​ పెంచేందుకు ఈఎస్​ స్థాయి ఆఫీసర్​ నుంచి కింది స్థాయిలో హోంగార్డ్​ వరకు టార్గెట్స్​ ఇస్తారు. అమ్ముతారో పారబోసుకుంటారో మీ ఇష్టం అన్న లెవల్​లో స్టాక్​ లిఫ్ట్​ చేయాలని ఒత్తిడి​ తెస్తారు.  అయితే ఎన్నికల కోడ్​ నేపథ్యంలో అధికారులు బెల్ట్​ షాపులు మూయించారు. పాత లైసెన్సుల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది.

డిసెంబర్​ 1 నుంచి కొత్త లైసెన్స్​దారులు షాపులు తీసుకుంటారు. ఆఫ్​ టేక్​ టార్గెట్​ ప్రకారం మద్యం లిఫ్ట్​ చేసి అమ్ముడవకపోతే మిగిలిపోతుందనే ఉద్దేశంతో వైన్స్​ షాప్స్​ ఓనర్లు మద్యం లిఫ్ట్​ చేసేందుకు ముందుకు రావడం లేదని ఎక్సైజ్​ ఆఫీసర్లు అంటున్నారు. అయితే తీసుకున్న స్టాక్​లో ఎక్కువ మొత్తం ఎలక్షన్స్​ కోసం తరలించారనే ప్రచారం జరుగుతోంది.​ ఈసీ నిబంధనలతో ఆఫ్​ టేక్​(మంత్లీ టార్గెట్)పై స్లాబ్​ విధించారు. రోజు 100 కాటన్ల లిక్కర్,100 కాటన్ల బీర్లకు ఫిక్స్​ చేశారు. నాగర్​ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణాలతో పాటు తెల్కపల్లి, బిజినేపల్లి, వట్టెం, వెల్దండ వంటి ప్రాంతాల్లో ఈ కోటా ఒక్క పూటకు కూడా చాలదు.

గత ఏడాది సేల్స్..

గత ఏడాది నవంబర్​లో 1,19,500 కేసుల లిక్కర్, 1,42,500  కేసుల బీర్లతో కలిపి రూ. 112.94 కోట్ల మందు విక్రయించారు. ఈ నెల 16 వరకు 70,700 కేసుల లిక్కర్, 83,800  కేసుల బీర్లతో కలిపి రూ.65.81 కోట్ల మందు అమ్మారు. గత ఏడాది నవంబర్​తో పోలిస్తే 20 శాతం ఆఫ్​టేక్​తో కలిపి 12 రోజుల్లో ఇంకా రూ.68 కోట్ల మద్యం అమ్మాల్సి ఉంటుంది.  

మందు ఇయ్యాల్సిందే..

గ్రామాల జనాభా, ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామ స్థాయి నాయకులు తమకు ఇంత మందు ఇయ్యాలని ముందే టార్గెట్లు పెడుతున్నారు. ఇవ్వడానికి డబ్బులు, పోయడానికి మందు లేకపోతే ఇబ్బంది పడతామని దబాయిస్తున్నారు. చీప్​ లిక్కర్​ ఇస్తే నడవదని ముందే వార్నింగులు ఇవ్వడం అభ్యర్థులకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అన్ని పొలిటికల్​ పార్టీలు లిక్కర్​ సెట్​ చేసి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 23 తరువాత లిక్కర్​ బాటిళ్లు ఇస్తామని చెప్పి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.   ​