దసరా పండగ నేపథ్యంలో ఇల్లీగల్ లిక్కర్ సీజ్

 దసరా పండగ నేపథ్యంలో ఇల్లీగల్ లిక్కర్ సీజ్

హైదరాబాద్‌, వెలుగు: దసరా పండగ నేపథ్యంలో నాన్‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌‌పై ఎక్సైజ్‌ పోలీసులు స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్ వద్ద చేపట్టిన తనిఖీల్లో.. ఓ వాహనంలో గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకొచ్చిన 449  మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

ధూల్​పేటలో నిర్వహించిన సోదాల్లో 72 మద్యం బాటిళ్లు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఏరియాలో 47 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాంపల్లి పిస్తా హౌజ్‌ ప్రాంతంలో మరో17 బాటిళ్లను సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ రూ.21.80 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.