ఖరీదైనా కొనేద్దాం! ఊరిస్తున్న డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐలు.. కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి..

ఖరీదైనా కొనేద్దాం! ఊరిస్తున్న డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐలు.. కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి..
  • కలిసి వచ్చిన జీఎస్టీ తగ్గింపులు
  • భారీగా పెరిగిన కన్జూమర్ డ్యూరబుల్స్​ లోన్లు

న్యూఢిల్లీ: జీఎస్​టీ రేటు తగ్గింపు కారణంగా ఖరీదైన టీవీలు, ఫ్రిజ్​లు, వాషింగ్​ మెషీన్ల వంటి హోం అప్లయెన్సెస్​లు, వెహికల్స్​ కొనడం పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్ లోన్స్‌‌‌‌‌‌‌‌పై బ్యాంకులు జీరో-కాస్ట్ ఈఎంఐలు, క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు, డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్ వంటివి అందిస్తున్నాయి. దీంతో హైఎండ్​ మోడల్స్​ కొనడానికి కస్టమర్లు వెనుకాడటం లేదు. ఉదాహరణకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ పర్సనల్​, కార్, హోం లోన్లపై రూ. 50 వేల వరకు సేవింగ్స్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 9.99 శాతం వడ్డీతో పర్సనల్​ లోన్లు ఇస్తోంది.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం ప్రత్యేక డీల్స్‌‌‌‌‌‌‌‌ను అందిస్తోంది. టూ-వీలర్ ఈవీ లోన్లు, సూపర్‌‌‌‌‌‌‌‌బైక్ లోన్‌‌‌‌‌‌‌‌లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్ టూ-వీలర్ కస్టమర్ల కోసం పండుగ స్కీమ్‌‌‌‌‌‌‌‌లను అందిస్తోంది. వీటిలో జీరో-కాస్ట్ ఈఎంఐ, ప్రాంప్ట్ పేమెంట్ రిబేట్, ఈఎంఐ లైట్ ఫెస్టివ్ (2025లో కొనుగోలు చేసి, 2026లో చెల్లించడం) వంటివి ఉన్నాయి. ప్రీఅప్రూవ్డ్​ కస్టమర్లకు,  క్రెడిట్ ప్రొఫైల్ బాగున్నవారికి బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు వెంటనే లోన్లు ఇస్తున్నాయి. జీఎస్​టీ రేటు తగ్గింపులు, ఆకర్షణీయమైన లోన్ ఆఫర్లు, డీలర్ల ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ల ప్రత్యేక డిస్కౌంట్లు కస్టమర్ చెల్లించాల్సిన కిస్తీల మొత్తాన్ని తగ్గిస్తున్నాయి.  

కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి..
ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడానికి కన్జూమర్ డ్యూరబుల్ లోన్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునేటప్పుడు, చాలా విషయాలను లెక్కలోకి తీసుకోవాలి. ప్రాసెసింగ్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఖర్చులు, ఫీజులు, జీఎస్​టీ కలిస్తే జేబుపై భారం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. లోన్​ను ఎంచుకునే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్‌‌‌‌‌‌‌‌క్లోజర్ ఛార్జీలు, పార్ట్ పేమెంట్ ఫీజు మొదలైన వాటిని పరిశీలించాలని పైసాబజార్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రాధికా బినానీ చెప్పారు. జీరో-కాస్ట్ ఈఎంఐపై ప్రాసెసింగ్ ఫీజును కూడా చూడాలని  అన్నారు.  ఆల్-ఇన్ కాస్ట్‌‌‌‌ను లెక్కించి, దానిని వస్తువు ధరతో పోల్చాలి.

కన్జూమర్​ డ్యూరబుల్స్ త్వరగా విలువను కోల్పోతాయి కాబట్టి తక్కువ కిస్తీలను ఎంచుకోవడం మంచిది. ఉత్పత్తి విలువ కంటే ఎక్కువ చెల్లించకుండా కొనాలి. వస్తువును సొంతం చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చును లెక్కించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. కిస్తీ చెల్లించకున్నా,  ఆటో- డెబిట్‌‌‌‌‌‌‌‌ కాకున్నా పెనాల్టీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి  రీపేమెంట్ రూల్స్​ను, షరతులను జాగ్రత్తగా చదవాలి.