
రోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా వాళ్లకు వీసా రూల్స్‌ను మరింత కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. చైనా వాళ్లు, అక్కడ ఉండే విదేశీయులు ఇప్పటికే తీసుకున్న వీసాలనూ రద్దు చేసింది. ‘‘జనవరి 15 తర్వాత ఇండియాకు వచ్చిన చైనా వాళ్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన హాట్‌లైన్ నంబర్ 011–23978046 నంబర్‌కు ఫోన్ చేయాలి. లేదా మెయిల్ చేయాలి’’ అని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇప్పటికే ఇచ్చిన వీసాలేవీ పనిచేయవు. అన్నింటినీ రద్దు చేస్తున్నాం. ఇండియాకు వెళ్లాలనుకునేవాళ్లు బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీకి రావొచ్చు. షాంఘై, గ్వాంగ్జూల్లోని కాన్సులేట్లనూ సంప్రదించొచ్చు’’ అని ప్రకటించింది. కరోనా ప్రభావంతో సరిహద్దు జిల్లాలను కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ అధికారులతో నిఘా పెట్టింది. దక్షిణ కన్నడ, కొడగు, చామరాజ్నగర్, మైసూరుల్లో నిఘా పెట్టింది. కాగా, చైనాలో కరోనా వైరస్ ధాటికి చనిపోయిన వారి సంఖ్య 425కి పెరిగింది. 20,438 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్‌పై పోరాడేందుకు ప్రపంచ దేశాలు ముందుకు కదలాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. అవసరమైతే తామూ నిధులిస్తామని పేర్కొంది. కాగా, కరోనా పేషెంట్ల కోసం వుహాన్‌లో పది రోజుల్లో పూర్తి చేసిన ఆస్పత్రిని చైనా సర్కార్ ఓపెన్ చేసింది.
ఓయూకు వచ్చే కొత్త స్టూడెంట్లకు కరోనా టెస్టులు
తార్నాక, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్లకు కరోనా టెస్టులను తప్పనిసరి చేశారు. ఇప్పటికే వర్సిటీలో చదువుతూ హాలిడేస్‌కు వెళ్లిన చైనా స్టూడెంట్లు, మళ్లీ వచ్చేటప్పుడు కరోనా టెస్టులు తప్పనిసరిగా చేసుకోవాలని వర్సిటీ అధికారులు ఉత్తర్వులిచ్చారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో చైనా, ఇతర దేశాల స్టూడెంట్లు గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో టెస్టులు చేయించుకుని మెడికల్ రిపోర్టుతో రావాలని, అప్పుడే అడ్మిషన్ ప్రక్రియ చేపడతామని ఓయూ అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఓయూ ఫారిన్ రిలేషన్స్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి చెప్పారు. చైనానుంచి తిరిగి వచ్చే విద్యార్థులు, కొత్తగా చేరే విద్యార్థులకు సైతం స్ర్కీనింగ్టెస్టు తప్పనిసరి చేశామన్నారు. ప్రస్తుతం ఓయూలో 26 మంది చైనా విద్యార్థులు చదువుతున్నారు.