మణిపూర్లో మళ్లీ కమలవికాసం..!

మణిపూర్లో మళ్లీ కమలవికాసం..!

మణిపూర్‌‌లో‌ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోనుందని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. ఎన్. ‌బీరేన్ సింగ్ సారథ్యంలో బీజేపీ 39 శాతం ఓట్ షేర్‌తో తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్సుందని తెలిపింది. రాష్ట్రంలోమొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 32 నుంచి 38 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 12 నుంచి 17 సీట్లు, ఎన్‌పీఎఫ్ 3 నుంచి 5, ఎన్‌పీపీ 2 నుంచి 4 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేస్తోంది. బీజేపీకి 39 శాతం ఓటింగ్ షేర్ రానుండగా.. కాంగ్రెస్‌ 30 శాతం, ఎన్‌పీఎఫ్ 9 శాతం, ఎన్‌పీపీ 6 శాతం, ఇతరులకు 16 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్ లెక్కలు చెబుతున్నాయి.

డిజైన్ బాక్స్డ్
మణిపూర్లో బీజేపీ 32 నుంచి 38 స్థానాల్లో గెలుపొందే అవకాశముందని డిజైన్ బాక్స్డ్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ 12 నుంచి 17, ఎన్ పీపీ 2 నుంచి 4, ఇతరులు 2 నుంచి 5 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. 

జన్ కీ బాత్
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం మణిపూర్లో బీజేపీ 23 నుంచి 28 సీట్లను గెలుచుకోనుంది. కాంగ్రెస్ 10 నుంచి 14, ఎన్పీపీ 7 నుంచి 8, ఇతరులు 12 నుంచి 18 సీట్లలో విజయం సాధించనున్నారు.