హైదరాబాద్, వెలుగు: ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ఓక్ మన రాష్ట్రంలో 25వ స్టోర్‌ను కొత్తగూడెంలో ప్రారంభించడం ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించింది. దాదాపు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌లో లివింగ్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు, డైనింగ్ రూమ్‌లకు అవసరమైన ఫర్నిచర్‌ను కొనుక్కోవచ్చు.
సోఫాలు, బెడ్‌లు, డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, రిక్లైనర్లు, పరుపులు, ఇంటీరియర్ డెకార్, ఆఫీస్, ఔట్‌డోర్ ఫర్నిచర్‌తో సహా అనేక రకాల స్టైలిష్ ఫంక్షనల్ ఐటమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
