పిల్లలపై అతిగా నిఘా వద్దు

పిల్లలపై అతిగా నిఘా వద్దు

టీనేజర్స్​ని ఎక్కువగా వేధించే సమస్యల్లో డిప్రెషన్​ నాలుగో స్థానంలో, యాంగ్జైటీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. అలాగే  15– 19 ఏండ్ల మధ్య వయసున్న పిల్లల మరణాల వెనకున్న కారణాల్లో  సూసైడ్​ మూడో ​ ప్లేస్​లో ఉంది. ఈ ఏజ్​ గ్రూప్​ పిల్లల్లో బిహేవియర్​ , ఈటింగ్ డిజార్డర్స్​, అడిక్షన్స్​ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనంతటికి కారణం వాళ్ల హార్మోన్లలో వచ్చే  తేడాలే. వాటివల్లే పిల్లల యాటిట్యూడ్​, మూడ్​  స్వింగ్స్​ నిమిషం నిమిషానికి మారుతుంటాయి. పిల్లల్లో కనిపించే ఈ మార్పుని ​ డీల్​ చేసే విధానం మీదే వాళ్ల భవిష్యత్తు ఆధారపడుతుంది. అందుకే  పిల్లలు తప్పుల చేేయకుండా.. జీవితంపై ఫోకస్ పెట్టాలంటే...  వాళ్లకి ఒక మంచి గైడ్​లా సపోర్ట్​ ఇవ్వాలి పేరెంట్స్​. అలాగే టీనేజర్స్​తో ఇలా ప్రవర్తించాలి.

  •   అప్పుడప్పుడు పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండటం మంచిదే. కానీ, దాన్నే పనిగా పెట్టుకుని... పిల్లలు చేసే ప్రతి పనిలో తలదూర్చకూడదు.  తుమ్మినా, దగ్గినా నిఘా పెట్టకూడదు. దొంగచాటుగా వాళ్లని వెంబడించడం, వాళ్ల పర్సనల్​ విషయాలు తెలుసుకోవడానికి  ఫోన్స్, వస్తువుల్ని సెర్చ్​ చేయడం లాంటివి కూడా చేయకూడదు. ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వాళ్ల ఫ్రెండ్స్​కి ఫోన్లు చేయడం.. సోషల్​ మీడియాలో వాళ్ల ఫ్రెండ్స్​ని ఫాలో అవ్వడం కూడా తప్పే. ఎందుకంటే...పేరెంట్స్​​ జాగ్రత్త పేరుతో చేసే ఈ పొరపాట్లు పిల్లల దృష్టిలో వాళ్లని విలన్స్​గా చూపెడతాయి. పేరెంట్స్​ అలా చేసినట్టు పిల్లలకు తెలిస్తే... తర్వాత నుంచి చేసే ఏ పనైనా అమ్మానాన్నలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అప్పుడు వాళ్లు చేసే తప్పులు తెలియకుండా పోతాయి. అలాగని వాళ్లకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వమని కాదు. వాళ్లు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. ఎలా ఉంటున్నారు అన్నది గమనించాలి. వాళ్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా వాళ్లనే నేరుగా అడగాలి. ఏమైనా మాట్లాడాలన్నా గొంతు పెంచి కాకుండా నెమ్మదిగా మాట్లాడాలి. 
  • టీనేజ్​లో హార్మోన్స్​ ఇంబాలెన్స్​ వల్ల పిల్లలకి యాక్నె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. బరువులోనూ హెచ్చు, తగ్గులు కనిపిస్తుంటాయి ఈ ఏజ్​లో. దాంతో చాలామంది పిల్లలు డిప్రెషన్​లోకి వెళ్తారు. అందంగా లేమని వాళ్లలో వాళ్లే బాధపడుతుంటారు. ఈ కారణాలతో సూసైడ్​ చేసుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య పెరిగింది. అందుకే ఈ ఏజ్​లో పిల్లల బ్యూటీ కేర్​పై​ పేరెంట్స్​ కూడా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లకు తగిన సలహాలు ఇవ్వాలి. అవసరమైతే వాళ్లని డెర్మటాలజిస్ట్​ దగ్గరకు తీసుకెళ్లాలి. వాళ్లు పేరెంట్స్​తో  కంఫర్టబుల్​గా ఉండేలా చూడాలి. వాళ్లని వాళ్లు యాక్సెప్ట్​ చేయడానికి ప్రిపేర్​ చేయాలి. అందం, ఆరోగ్యం లాంటి విషయాల గురించి వివరంగా చెప్పాలి.
  •  స్మోకింగ్, ఆల్కహాల్​ లాంటి చెడు అలవాట్లకి పిల్లలు ఎక్కువగా అలవాటయ్యేది టీనేజ్​లోనే. అయితే దీనికి ఒకవిధంగా పేరెంట్స్​ కూడా కారణమే . చాలామంది పేరెంట్స్ స్మోకింగ్​, ఆల్కహాల్​ గురించి మాట్లాడరు పిల్లల ముందు. వాటి నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడానికి  అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ, అసలు దాని వల్ల జరిగే నష్టాలేంటో పిల్లలకి చెప్పరు. చిన్నప్పట్నించీ ఈ విషయంలో పెద్దలు పిల్లల్ని గైడ్​ చేస్తే అసలు సమస్యే మొదలు కాదు. 
  •  కొంతమంది పేరెంట్స్​ పిల్లల్ని ఫ్రెండ్స్​తో కలవనివ్వరు. సినిమాలకి, పిక్నిక్స్​కు వెళ్లని వ్వరు. కొత్తవాళ్లెవ్వరితోనూ స్నేహం చేయొద్దని చెప్తుంటారు కూడా. కానీ, అది పిల్లల మానసిక ఎదుగుదలకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్​ కన్నా ఫ్రెండ్స్​తోనే కొన్ని విషయాలు షేర్​ చేసుకోగలుగుతారు. అలాగే కొత్త వాళ్లతో  స్నేహం చేయనివ్వకపోవడం వల్ల వాళ్లు ఫ్యూచర్​లో  తెలియనివాళ్లతో కమ్యూనికేట్​ చేయడానికి ఇబ్బంది పడతారు. అందుకే పిల్లల్ని స్నేహం చేయనివ్వాలి.. కాకపోతే స్నేహంలోని మంచి, చెడులని గుర్తించే  విధంగా​ వాళ్లని పెంచాలి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా పిల్లల్ని సినిమా లకి, పిక్నిక్స్​కు, బయట డిన్నర్స్​కి తీసుకెళ్తుంటే  వాళ్లలోని మూడ్​ స్వింగ్స్​ కంట్రోల్​లో​ ఉంటాయి.
  • పిల్లలకి సంబంధించిన ప్రతి చిన్న విషయం తమకు నచ్చినట్టే జరగాలి అనుకుంటారు కొందరు పేరెంట్స్​.  ఆ ఆలోచనతోనే వాళ్లని ఎక్కువగా  కంట్రోల్​ చేస్తుంటారు. ‘అది చేయొద్దు.. ఇలానే ఉండు..’ అంటూ రిస్ట్రిక్షన్స్​ పెడుతుంటారు. భయపెట్టి, బెదిరించి వాళ్ల మాట వినేలా చేసుకుంటారు. కానీ, ఎంత గట్టి దారమైన తెగే దాక లాగితే ముక్కలు అవుతుంది. అదే పేరెంట్స్​, పిల్లల రిలేషన్​లోనూ జరుగుతుంది. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల మొండిగా తయారవుతారు వాళ్లు. పెద్దలపై ఉన్న భయం, గౌరవం పోయి చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అన్నింట్లో కాకపోయినా... వాళ్ల జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్లోనైనా  వాళ్లకు నిర్ణయం తీసుకునే ఫ్రీడం ఇవ్వాలి. ఒకవేళ ఆ నిర్ణయం పేరెంట్స్​కి నచ్చకపోతే సర్ది చెప్పి ఒప్పించాలే తప్ప.. భయ పెట్టకూడదు.