ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎగ్జామ్స్​ ఫీజుల పేర ప్రైవేట్​ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్​ డిమాండ్​చేశారు. బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట సోమవారం ధర్నా  చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్, ఇంటర్​ ఎగ్జామ్స్​ ఫీజు రూ. వందల్లో ఉంటే వేలల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీరునాయక్, రవి కుమార్, నిరంజన్, కల్యాణ్, కమలి, కౌసల్య పాల్గొన్నారు. 

అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులుగా గుర్తించాలి

ఎస్సీ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో నడిచే కాలేజ్​ హాస్టళ్లలో పని చేస్తున్న వారిని అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేస్తూ రిపబ్లిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా జిల్లా అధ్యక్షుడు కోట శివశంకర్​ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టారు. వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

పోడు భూములకు పట్టాలివ్వాలి 

పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. కొత్త పోడు భూమి అని అంటూ సర్వే చేయడం లేదని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు మెరుగైన సేవలందించాలి

ఖమ్మం రూరల్​, వెలుగు: మార్క్ ఫెడ్​ ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలందించాలని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సూచించారు. మండలంలోని పెద్ద తండాలో మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాపార విస్తరణలో భాగంగా పెట్రోల్ పంప్  ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, అడిషనల్​ కలెక్టర్ ఎన్ మధుసూధన్, మార్క్ ఫెడ్  చైర్మన్  గంగారెడ్డి, సుడా చైర్మన్  బచ్చు విజయ్ కుమార్, మార్క్ ఫెడ్  వైరా వైస్  చైర్మన్  బొర్రా రాజశేఖర్, ఖమ్మం మార్కెట్  కమిటీ చైర్ పర్సన్  లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

వనజీవి రామయ్య పార్కు ప్రారంభం

ఖమ్మం కార్పొరేషన్: నగరంలో ఏర్పాటు చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య పార్కును మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.100 కోట్లతో అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ, పార్కులతో డెవలప్​ చేసినట్లు చెప్పారు. అనంతరం మొక్కలు నాటారు. నగరపాలక సంస్థ కమిషనర్​ ఆదర్శ్​సురభి, మేయర్​ నీరజ, డీఎఫ్​వో సిద్ధార్థ్​​విక్రమ్​సింగ్, సుడా చైర్మన్​ విజయ్​కుమార్​ పాల్గొన్నారు. 

కలెక్టరేట్​ పనుల పరిశీలన

కలెక్టరేట్​ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టరేట్ ను​ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్​ వస్తారని, త్వరగా పనులు కంప్లీట్​  చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎంపీల పర్యటనను సక్సెస్​ చేయాలి

సత్తుపల్లి, వెలుగు: ఈ నెల 18న రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర సత్తుపల్లి రానున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సోమవారం క్యాంప్  ఆఫీసులో సత్తుపల్లి పట్టణ, మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఇద్దరికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేయనున్న సభను సక్సెస్​ చేయాలని కోరారు. భారీ ర్యాలీతో స్వాగతం పలకాలని సూచించారు. జేవీఆర్  డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్  చైర్మన్ కూసంపుడి మహేశ్, వైస్  చైర్ పర్సన్  తోట సుజలరాణి, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్​రావు, జడ్పీటీసీ కూసంపుడి రామారావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మందపాటి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, వీరపనేని రాధిక బాబి, చాంద్ పాషా, రఘు, మౌలాలి, రఫీ, అంకమ రాజు, వల్లభనేని పవన్  పాల్గొన్నారు.

ఏపీ లారీల అడ్డగింత

వైరా, వెలుగు: ఏపీకి చెందిన లారీలతో బియ్యం రవాణా చేస్తూ తమకు నష్టం కలిగిస్తున్నారని సోమవారం ఏపీకి చెందిన లారీలను లారీ అసోసియేషన్​ ఆ ధ్వర్యంలో పల్లిపాడు స్వర్ణ భారతి కోల్డ్ స్టోరేజీ వద్ద అడ్డుకొని నిరసన తెలిపారు. కొణిజర్ల మండలం తీగల బంజర గ్రామ సమీపంలోని సర్  రైస్ ప్రొడక్ట్స్​లోని బియ్యాన్ని ఏపీకి చెందిన లారీలతో  సప్లై చేస్తుంటే తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా ప్రాంతానికి చెందిన లారీలకు  అవకాశం ఇస్తామని రైస్​ మిల్​ యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు వి సత్యం, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, నాయకులు చావా కోటేశ్వరరావు, అట్లూరి శ్రీనివాసరావు, యాకూబ్  పాల్గొన్నారు.