గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు - నార్త్ జోన్ డీసీపీ

గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు - నార్త్ జోన్ డీసీపీ

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్టుగూడలోని దూద్ బావి ప్రాంతంలో ఘటన
మరో ఏడుగురికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
నాలుగు ఇండ్లు ధ్వంసం.. చెల్లాచెదురుగా ఇంట్లోని సామాన్లు

సికింద్రాబాద్ : గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేలి ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ మెట్టుగూడ దూద్ బావి ప్రాంతంలో బుధవారం ఉదయం 8:45 గంటలకు జరిగింది. నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. దూద్ బావిలో జాఫర్ అనే వ్యక్తికి జీ ప్లస్ 1 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. కింద పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాఫర్ తన కుటుంబ సభ్యులతో నివాసం ఉండగా, పక్కన మరో రెండు ఫ్యామిలీలు, పై అంతస్తులో ఇంకో 2 ఫ్యామిలీలు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉంటున్నాయి. ఉదయం 8.45 గంటల సమయంలో జాఫర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దం చేస్తూ పేలింది. దీంతో 4 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఇంటి గోడలు కూలిపోయాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు సమయంలో పక్క పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న బెజ్జంకి నారాయణ స్వామి (55) ఇంటి ముందు నిలబడి ఉండగా, పేలుడుదాటికి ఫ్రిజ్ డోరు ఎగిరివచ్చి అతనికి బలంగా తాకింది. అదే సమయంలో ఇంటి గోడ కూలి అతని మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్వామితో పాటు ఇంటి ఓనర్లు జాఫర్, అతని భార్య హలీమ బేగం, పక్క ఇంట్లో ఉంటున్న నర్సింగ్ రావు, శ్రీనివాస్, శైలజ, సంజన, ఊర్మిళలకు గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, నారాయణ స్వామి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. గాయలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు

మెట్టుగూడ దూద్ బావిలో గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు జరిగిందని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు జరిగిందన్నారు. హాలీమా బేగంకు రాత్రి 3 గంటలపుడు  గ్యాస్ లీక్ అవుతున్నట్లు వాసన వచ్చింది. ఆమె పట్టించుకోకుండా అలాగే నిద్రపోయింది. ఉదయం 8:30 కు గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే అప్పటికే ఇళ్లంతా వ్యాపించిన గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒక్కసారిగా పేలుడు జరిగింది. రెండు సిలిండర్లు పేలడంతో తీవ్రత ఎక్కువగా ఉందని చందనా దీప్తి పేర్కొన్నారు. ఈ పేలుడు కేవలం గ్యాస్ లీకేజీ వల్లే జరిగిందని స్పష్టం చేశారు. 

బాధితులను ఆదుకుంటాం.. 

ప్రమాద స్థలాన్ని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత గాంధీ, యశోద హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గాంధీ సూపరింటెండెంట్, యశోద యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధితులకు, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.