ఓటర్ ఐడీతో ఆధార్ లింక్​ గడువు పెంపు

ఓటర్ ఐడీతో ఆధార్ లింక్​ గడువు పెంపు
  • 2024 మార్చి 31 వరకు అవకాశం

న్యూఢిల్లీ : ఓటర్ ఐడీతో ఆధార్ నంబర్ ను​అనుసంధానం చేసే గడువును కేంద్రం మరో ఏడాది పొడిగించింది. ఇంతకుముందు ఏప్రిల్ 1, 2023 లోపు లింక్ చేసుకోవాలని డెడ్​లైన్​విధించిన ప్రభుత్వం.. ఆ గడువును మార్చి 31, 2024 వరకు పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది (2022) జూన్ 17న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1తో ఓటర్ ఐడీతో ఆధార్ నంబర్ లింక్​ చేసుకొనే గడువు ముగియనుండగా మరోసారి పొడిగిం చింది.  2022, ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ కార్డు నంబర్లను సేకరిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 12 వరకు 54.32 కోట్ల ఆధార్ కార్డు నంబర్లను సేకరించినట్లు ఎన్నికల కమిషన్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వాటిని అనుసంధా నించే ప్రాసెస్​ మాత్రం ఇంకా మొదలు కాలేదు. కాగా, జనవరి 1, 2023 నాటికి దేశంలో 95 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని ఈసీ తెలిపింది.