Cricket World Cup 2023: బ్రిటన్ ప్రధాని చేతిలో కోహ్లీ బ్యాట్..గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన భారత విదేశాంగ మంత్రి

Cricket World Cup 2023: బ్రిటన్ ప్రధాని చేతిలో కోహ్లీ బ్యాట్..గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన భారత విదేశాంగ మంత్రి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించింది. మొన్నటివరకు స్పోర్ట్స్ వరకే వినిపించిన  విరాట్ పేరు ఇప్పుడు  ఏకంగా బ్రిటన్ ప్రధాని వరకు విస్తరించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్  UK ప్రధాన మంత్రి రిషి సునక్ కు గిఫ్ట్ గా అందజేశాడు. నిన్న (నవంబర్ 12) దీపావళి కావడంతో విరాట్ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. 

జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. శనివారం బ్రిటన్ చేరుకున్న ఆయన నవంబర్ 15 న తన పర్యటనను ముగించుకొని.. తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలవనున్నారు.  జైశంకర్ UK ప్రధానమంత్రితో తన సమావేశం గురించిన వివరాలను పంచుకున్నారు. దీపావళి రోజున ప్రధానమంత్రి రిషి సునక్ కు కలవడం ఆనదంగా ఉందని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Also Read :- అజేయ జట్టుగా భారత్: చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన టీమిండియా

నిన్న ( నవంబర్ 12) నెదర్లాండ్స్ తో జరిగిన వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 51 పరుగులు చేసి బ్యాట్ తో రాణించడంతో పాటు బౌలింగ్ లోనే ఒక కీలక వికెట్ తీసుకొని అభిమానులకు దీపావళి గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం 594 పరుగులు చేసిన విరాట్.. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్ర స్థానంలో నిలిచాడు. నవంబర్ 15 న ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో భారత్ మొదటి సెమీ ఫైనల్లో తలపడనుంది.