బ్రెజిల్ లో వరదల బీభత్సం

బ్రెజిల్ లో వరదల బీభత్సం

బ్రెజిల్ లో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అకస్మాత్తుగా విరుచుకుపడుతున్న వరదలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా చోట్ల  జనజీవనం స్థంభించిపోయింది. ఇప్పటివరకు 30 మందికి పైగా జనం వరదల ధాటికి చనిపోయారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత  24 గంటల్లోనే  30 మందికి పైగా చనిపోయినట్లు బ్రెజిల్ అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధానంగా పెర్నమ్ బుకో స్టేట్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వెయ్యి మందికి పైగా  జనాన్ని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. 33 మున్సిపాలిటీల పరిధిలో ఎమర్జెన్సీ విధించారు. చాలా చోట్ల ఇండ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. కొన్నిచోట్ల కార్లు నీట మునిగాయి. పెర్నమ్ బుకో ఏరియాలో 23 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సగటున ఒక నెలలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో పడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 
మరిన్ని వార్తల కోసం..

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు

సొంతగడ్డపై గుజరాత్ గెలిచేనా..?