
దేశంలోనే అతిపెద్ద IT సర్వీసెస్ ఎక్స పోర్టర్ టాటా కన్సీల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగుల తొలగింపుపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల టీసీఎస్ నుంచి 80 వేల మంది ఉద్యోగులను తొలగించారని బాగా ప్రచారం జరిగింది.. ఈ ప్రచారంపై స్పందించిన టీసీఎస్ కంపెనీ చీఫ్ HR క్లారిటీ ఇచ్చారు.
టీసీఎస్ ఉద్యోగుల్లో కేవలం 1 శాతం మంది ఉద్యోగులు అంటే 6 వేల మందిని మాత్రమే తొలగించామని చెప్పారు. 80వేల మంది ఉద్యోగులను తొలగించారు అని వస్తున్న వార్తలను చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. కొత్త టెక్నాలజీ వినియోగం, సంస్థాగత మార్పులతో ఉద్యోగులను తొలగించాం.. వారికి సెవరెన్స్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఐటీ ఎంప్లాయీస్ సంఘం NITES విడుదల చేసిన లిస్టు ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం Q2 లో 5లక్షల 93వేల 314 మంది టీసీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదే 2026 ఆర్థిక సంవత్సరం Q1 లో 6లక్షల 13వేల 069 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం.. దాదాపు 20 వేల మంది ఉద్యోగులను తొలగించారని తెలుస్తోంది.
2025లో TCS లేఆఫ్‌లు ..సెవరెన్స్ ప్యాకేజీలు..
టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయక సంస్థ అయిన TCS జూలైలో 12వేల 261 ఉద్యోగాల తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది టీసీఎస్ వర్క్ ఫోర్స్ లో 2శాతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. బిజినెస్ డిమాండ్ ను ప్రభావితం చేస్తున్న మార్కెట్ అనిశ్చితి పరిస్థితులతో ఈ వారం ప్రారంభంలో 12వేల మంది ఉద్యోగులు అంటే 2శాతం ఉద్యోగులను తొలగించింది.
వీరిలో ప్రాజెక్టులకు కేటాయించబడని వారు.. స్కీల్స్ లేని వారు,15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న దీర్ఘకాలిక ఉద్యోగులు ఉన్నారు.ఈ తొలగింపులు ప్రధానంగా సీనియర్, మిడిల్-మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై ప్రభావితం చూపాయి.తొలగించిన ఉద్యోగులకు వర్గాల వారీగా ప్యాకేజీలు ప్రకటించింది. ఉద్యోగులకు మూడు నెలల నోటీస్ పీరియడ్, ఆరునెలల నుంచి ఒక సంవత్సరం వరకు జీతం, అదనపు అలెవెన్సులను ఇచ్చింది.