
జడ్చర్ల, వెలుగు : చెరువు అలుగు దాటుతుండగా వరద ప్రవాహంలో దంపతులు గల్లంతయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని జడ్చర్ల మండలంలోని రాయికుంట గ్రామానికి చెందిన తానెం బాలయ్య (75), రాములమ్మ (68) దంపతులు.
వీరిద్దరు గురువారం పని కోసం కిష్టారం గ్రామానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకొని సాయంత్రం తిరిగి వెళ్తూ మార్గమధ్యలోని పోతిరెడ్డిచెరువు అలుగును దాటేందుకు ప్రయత్నించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు.