
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆన్‌లైన్ చెల్లింపులను మరింత స్మార్ట్, స్పీడ్, సౌకర్యవంతంగా మార్చే నాలుగు కొత్త డిజిటల్ టూల్స్‌ను ఆవిష్కరించారు. ఏఐ, IoT, యూపీఐ ఆధారంగా రూపొందించిన ఈ పేమెంట్ సొల్యూషన్లు రిజర్వు బ్యాంక్ Payments Vision 2025 దిశగా ముందడుగుగా పేర్కొన్నారు.
ఏఐ ఆధారిత యూపీఐ పేమెంట్స్..
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సపోర్ట్ సిస్టమ్. వినియోగదారులు తమ లావాదేవీల స్థితిని తెలుసుకోవడానికి, ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్ కోసం మార్గదర్శనం పొందడానికి సహాయపడుతుంది. RBI అభివృద్ధి చేసిన స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తున్న ఈ సిస్టమ్ ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే భారతీయ ప్రాంతీయ భాషల్లో విస్తరించనున్నది. ఇది బ్యాంకులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడంలో కూడా దోహదపడనుంది.
IoT పేమెంట్స్..
సాంకేతికతతో అనుసంధానమైన ఈ పద్ధతిలో యూజర్లు వారు కనెక్టెడ్.. కార్లు, స్మార్ట్ గ్లాసెస్ లేదా స్మార్ట్ టీవీల ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ఇంధనం, EV ఛార్జింగ్ లేదా హోమ్ సర్వీసెస్ వంటి సేవలకు ఇది మరింత వేగవంతమైన ఆలస్యాలు లేని పేమెంట్ అనుభవం కల్పిస్తుంది.
బ్యాంకింగ్ కనెక్ట్..
NPCI భారత్ బిల్ పే లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ ఇంటర్‌ఒపరబుల్ నెట్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, వినియోగదారులు మరింత సులభంగా బ్యాంకింగ్ సేవలను పొందగలరు. QR కోడ్ పేమెంట్లు, ‘Pay via App’ వంటి ఫీచర్లతో ఇది మొబైల్-ఫస్ట్ అనుభవాన్ని అందిస్తుంది.
ALSO READ : ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన మ్యూచువల్ ఫండ్..
యూపీఐ రిజర్వ్ పే..
ఈ కొత్త ఫెసిలిటీ ద్వారా ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సేవల వంటి ప్లాట్‌ఫామ్‌లలో మళ్లీ మళ్లీ చేసే లావాదేవీలను సులభతరం చేస్తుంది. వినియోగదారులు తమ బ్లాక్ చేసిన, పేమెంట్స్ కోసం వినియోగించిన UPI క్రెడిట్‌ను స్పష్టంగా చూడగలరు. అలాగే ప్రతి కొనుగోలు సమయంలో కార్డు వివరాలు లేదా OTP డిటైల్స్ ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది.
భారత్ ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ కొత్త టూల్స్ వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శక ఆన్‌లైన్ పేమెంట్ అనుభవాన్ని అందిస్తాయని చెప్పారు.