
మరో వారంలో చనిపోతాడు.. అని హారీ షా తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. కానీ, తనకు అరుదైన బోన్ కేన్సర్ ఉన్నట్టుగానీ, చనిపోతానని గానీ ఆ చిన్నారికి తెలియదు. రేసర్ లూయిస్ హామిల్టన్ అంటే చాలా ఇష్టం. స్పానిష్ గ్రాండ్ ప్రిలో పాల్గొంటున్న హామిల్టన్‌కు ఆస్పత్రి బెడ్ పై నుంచే హారీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. గెలవాలని కోరుకున్నాడు. ఆ వీడియోను మెర్సిడిస్ ప్రతినిధులు హామిల్టన్‌కు చూపించారు. దానికి చలించిపోయిన అతడు, ఆ ఐదేళ్ల చిన్నారికి తన రేస్ కారు డూప్‌ను పంపించాడు. గ్రాండ్ ప్రి విన్నర్ ట్రోఫీనీ గిఫ్ట్ కింద ఇచ్చాడు. ఈ చిన్నారి తనకో మంచి సందేశం ఇచ్చాడని, అతడే తనకు స్ఫూర్తి అని హామిల్టన్ రేస్ అయ్యాక చెప్పాడు. రేస్ గెలుపును హారీకి అంకితమిస్తున్నట్టు చెప్పాడు. తన కోసం ఏదైనా చేయాలనిపిస్తోందన్నాడు.