Facebook news Tab: ఇకనుంచి ఫేస్బుక్లో న్యూస్ ట్యాబ్ కనిపించదు

Facebook news Tab: ఇకనుంచి ఫేస్బుక్లో న్యూస్ ట్యాబ్ కనిపించదు

ఫేక్బుక్ తన న్యూస్ ట్యాబ్ (Facebook News) ను తొలగించేందుకు సిద్ధమైంది. వినియోగదారులు చాలా తక్కువ భాగం మాతర్మే వార్తలను చదవడానికి ఈ ఫ్లాట్ ఫారమ్ ను వినియోగిస్తున్నారని, ఇది వార్తలకు అంత ప్రాధాన్యత సోర్స్ కాదని మెటా ప్రకటించింది.  2023లో అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఫేస్ బుక్ వార్తల ట్యాబ్ ను 80 శాతం తక్కువగా వినియోగించారని.. అందుకే ఆ దేశాల్లో ఫేస్ బుక్ వార్తల ట్యాబ్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లలో 2023లోనే ఫేస్ బుక్ న్యూస్ ట్యాబ్ ను తొలగించారు. 

X(గతంలో ట్విట్టర్)  ఫ్లాట్ ఫారమ్ మాదిరిగా వార్తలు, రాజకీయాలపై దృష్టి సారించే సోషల్ మీడయా ఫ్లాట్ ఫారమ్ గా పరిణామం చెందడం ఇష్టం లేకపోవడమే ఫేస్ బుక్ న్యూస్ ట్యాబ్ నిలిపివేయడానికి మరో కారణమని కంపెనీ ప్రకటించింది. వినోదాత్మక కంటెంట్ తో పోలిస్తే వార్తల కంటెంట్ కంపెనీకి తక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని వెల్లడించింది. 

మరోవైపు ఇన్ స్టాగ్రామ్, థ్రెడ్స్ ఫ్లాట్ ఫారమ్ లలో కూడా రాజకీయ కంటెంట్ పై ఆంక్షలు విధిస్తామని మెటా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యూఎస్  లో ఎన్నికలు సమీస్తున్న క్రమంలో తాజా ఫేస్ బుక్ కోసం కూడా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది.