
మలయాళం అండ్ తెలుగు,తమిళ చిత్రాలతో వరుస సినిమాలు చేస్తున్న జాతీయ ఉత్తమ నటుడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్..సింపుల్ గా ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)గా ఎంతో గుర్తింపు పొందారు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా మరింత ఫేమస్ అయ్యాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ..తనదైన నటనతో ప్రేక్షకుల మనస్సులో ఫహద్ ఫాజిల్ సినిమాలంటే..ఒక సిగ్నేచర్ మూమెంట్ ని క్రియేట్ చేశాడు.
సుకుమార్ - బన్ని కాంబినేషన్ లోని వచ్చిన పుష్పలో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఫహద్..నెక్స్ట్ రాబోయే సీక్వెల్ పుష్ప 2లో కూడా కనిపించనున్నాడు. ఇవే కాదు..ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ ఏకంగా డజను సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాల లిస్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.
ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో ఫహద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా రెండు కొత్త సినిమాలను కూడా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లను షేర్ చేసింది.
సిద్ధార్థ్ నాదెళ్ల డెబ్యూ డైరెక్టర్ గా ‘ఆక్సిజన్’ (OXYGEN) పేరుతో ఓ సినిమాని ఆర్కా మీడియా ప్రకటించింది. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో రాబోతోంది. వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఆక్సిజన్ తెరెకెక్కిస్తుండగా..శోభ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కార్తికేయలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: 24 క్రాఫ్ట్స్ సిబ్బందికి సంక్షేమం అందిస్తాం
శశాంక్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కున్న మరో చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Dont Trouble The Trouble). ఫన్, థ్రిల్, ఎమోషన్స్‌తో వస్తోన్న ఫాంటసీ చిత్రం. ఈ సినిమాకి ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి 2025 లో రిలీజ్ కానుంది.
అలాగే ఈ ఏడాది ఫహద్ ఫాజిల్..లైనప్ సినిమాల లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.
ఆవేశం- జిత్తు మాధవన్..ఇందులో రౌడీ లీడర్‌గా నటిస్తున్నాడు. షెర్లాక్ -MT వాసుదేవన్ నాయర్ కథల ఆధారంగా మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్నాడు.(నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ), ఓడుం కుతిర చాదుం కుతిర - అల్తాఫ్ సలీం. రజినీకాంత్ హీరోగా వెట్టయన్(తెలుగులో వేటగాడు) - T.J జ్ఞానవేల్ (తమిళం),మామన్నన్ తర్వాత నటులు ఫహద్ ఫాసిల్ మరియు వడివేలు ఇద్దరు కలిసి కొత్త చిత్రంలో నటిస్తున్నారు అదే మారీసన్ - సుధీష్ శంకర్ డైరెక్టర్ (తమిళం), కరాటే చంద్రన్ - రాయ్ (అరంగేట్రం) చిత్రాలలో నటిస్తున్నాడు. మహేష్ నారాయణన్, విపిన్ దాస్ లతో సినిమాలు చేస్తున్నాడు.
Welcoming the incredibly versatile talent ? Mr. Fahadh Faasil ✨ on board for #Thalaivar170??#Thalaivar170Team gains a powerful new addition with the astonishing performer ? #FahadhFaasil joining them. ???@rajinikanth @tjgnan @anirudhofficial @RanaDaggubati… pic.twitter.com/cOYwaKqbAL
— Lyca Productions (@LycaProductions) October 3, 2023
ఈ లెక్కన చూసుకుంటే ఫహద్ ఫాజిల్ ఎంతలా బిజీగా ఉన్నాడో అర్ధం చేసుకోవొచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే కావాల్సింది టాలెంట్ అని మిమ్మల్ని చూసి నేర్చుకుంటే చాలేమో అనేలా ఉంది మీ ప్రయాణం అంటున్నారు సినీ ఫ్యాన్స్.
So many thoughts come to my mind as we announce these two amazing films! Firstly, working with the versatile and brilliant Fahadh Faasil, is super exciting for us and that too on two projects is simply amazing!
— Shobu Yarlagadda (@Shobu_) March 19, 2024
Second, we are introducing two talented directors Shashank &… pic.twitter.com/CtdfMG5Cco