ధోని కెప్టెన్సీలో తొలి మ్యాచ్..రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

ధోని కెప్టెన్సీలో తొలి మ్యాచ్..రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

భారత క్రికెటర్ ఫైజ్ ఫజల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైజ్ ఫజల్ బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా తరపున కేవలం ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. 2016లో MS ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, జింబాబ్వే పర్యటనలో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ లో KL రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ప్రత్యర్థి జట్టును 123 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. వికెట్ నష్టపోకుండా 22 ఓవర్లలోపే ఛేదించింది. తన తొలి మ్యాచ్ లోనే ఫజల్ అదరగొట్టాడు. 

61 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అప్పటి నుంచి ఈ మహారాష్ట్ర ప్లేయర్ కు భారత జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరపున ఒక్కటే వన్డే ఆడినా.. దేశవాళీ క్రికెట్ లో ఈ యంగ్ ప్లేయర్ కు అద్భుతమైన రికార్డ్ ఉంది. 137 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 9183 పరుగులు చేశాడు. 113 లిస్ట్ A  మ్యాచ్ ల్లో 3641 పరుగులు చేశాడు. T20 ఫార్మాట్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్..66 మ్యాచ్‌లు ఆడి నాలుగు అర్ధసెంచరీలతో 1273 పరుగులు చేశాడు.

రంజీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో విదర్భ మ్యాచ్ తర్వాత 38 ఏళ్ల ఫజల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 21 ఏళ్ల కెరీర్‌లో దేశానికి , విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో అతిపెద్ద గౌరవంగా అతను తెలియజేశాడు. క్రికెట్ జెర్సీలను ధరించడం నాకెప్పుడూ నా జీవితంలో గొప్ప అనుభూతి. నా ఫేవరేట్ జెర్సీ నంబర్ 24ను మీరు చాలా మిస్ అవుతున్నాను అని అన్నారు.