
- చెప్పినవి జరగకపోవడంతో గ్రామస్తులు నిలదీయడంతో పరార్
- జనగామ జిల్లాలో ఘటన
పాలకుర్తి, వెలుగు: ఇంట్లో కీడు జరిగిందని బాగు చేస్తామని.. అనారోగ్యాన్ని నయం చేస్తామని.. సిరి సంపదలు సృష్టిస్తామని.. శని వదిలిస్తామని.. నకిలీ బాబాలు రూ. 2 లక్షల దాకా వసూళ్లకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లే.. ఆంధ్రాకు చెందిన కొందరు వ్యక్తులు వారం రోజుల కింద పాలకుర్తి మండలం విసునూరు గ్రామానికి వచ్చారు. తమను బాబాలుగా పరిచయం చేసుకొని గ్రామంలో తిరుగుతూ ఇంటి అదృష్ట రేఖను మారుస్తామని నమ్మించి పలువురి వద్ద రూ. 10 వేల నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేశారు.
బాబాలు చెప్పినవి ఏమీ జరగకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు. తమ డబ్బులు ఇవ్వాలని, లేదంటే పోలీసులకు చెబుతామని తేల్చిచెప్పారు. దీంతో భయపడిన బాబాలు వసూలు చేసిన డబ్బుల్లో రూ.1 లక్ష దాకా తిరిగి ఇచ్చి రాత్రికి రాత్రే పారిపోయారు. దొంగ బాబాల వసూళ్లపై స్థానికులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.