ఫేక్ సర్టిఫికెట్ల కేసు: భోపాల్ నుంచి హైదరాబాద్.. 

ఫేక్ సర్టిఫికెట్ల కేసు: భోపాల్ నుంచి హైదరాబాద్.. 
  • క్లర్కు నుంచి వీసీ వరకు అందరికీ ప్రమేయం
  • దేశ వ్యాప్తంగా వందల మందికి ఫేక్ సర్టిఫికెట్లు జారీ
  • 7 రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్: ఫేక్ సర్టిఫికెట్ల కేసు కీలక మలుపు తిరిగింది. మలక్ పేట్ శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీపై గతంలో నమోదైన కేసులో ఇద్దరు వైస్ ఛాన్స్లర్లను  అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిని భోపాల్ సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీకి చెందిన వీసీలుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి హైదరాబాద్కు ఫేక్ సర్టిఫికేట్స్ దందా నడుస్తునట్లు పోలీసులు తెలిపారు. 
ఇప్పటి వరకు ఏడుగురు ఏజెంట్స్ ను అరెస్ట్ చేశామన్నారు. 19 మంది విద్యార్ధులు, ఆరుగురు తలిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి దగ్గర 2 నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లు  తెలిపారు పోలీసులు. క్లర్క్ నుంచి వీసీల వరకు అందరికీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశవ్యాప్తంగా వందల మందికి ఫేక్ సర్టిఫికేట్స్ జారీ అయినట్లు గుర్తించామన్నారు. ఏడు రాష్ట్రాల్లో.. ఏడు పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.

 

 

 

ఇవి కూడా చదవండి

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె