ఆదిలాబాద్లో నకిలీ డిటర్జెంట్ దందా..నలుగురి అరెస్ట్

ఆదిలాబాద్లో నకిలీ డిటర్జెంట్ దందా..నలుగురి అరెస్ట్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ డిటర్జెంట్ దందా సాగుతోంది. ఆదివారం(ఆగస్టు31) బొలేరో వాహనంలో తరలిస్తున్న15 క్వింటాళ్ల నికిలీ డిటర్జెంట్ ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. 

మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆదిలాబాద్ కు ఈ నకిలీ డిటర్జెంట్ ను బొలెరో వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నకిలీ డిటర్జెంట్ తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బొలెరే వాహనాన్ని సీజ్ చేశారు. 

నకిలీ డిటర్జెంట్ పట్టుకున్న తర్వాత మీడియా సమావేశంలో పూర్తి వివరాలు  వెల్లడించారు ఆదిలాబాద్ డిఎస్పీ జీవన రెడ్డి చెప్పారు. నకిలీ వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.