సంగారెడ్డిలో నకిలీ డాకుమెంట్స్ గ్యాంగ్ అరెస్ట్

సంగారెడ్డిలో నకిలీ డాకుమెంట్స్ గ్యాంగ్ అరెస్ట్

తెలంగాణలో భూముల విలువలు పెరగడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు సిద్ధమైన అక్రమార్కులు...  నకిలీ పత్రాలను, నకిలీ ఓనర్ లను సృష్టిస్తూ అమాయక ప్రజల స్థలాలను కాజేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఓ ముఠా అరెస్ట్ చేశారు పోలీసులు. అమీన్ పూర్ లో కరుపోతుల మహేష్  తండ్రి ఉప్పలయ్య 120 గజాల ప్లాట్  పరమేశ్ అనే వ్యక్తి దగ్గర కొన్నాడు. 

అయితే ఈ భూమిపై కన్నేసిన  తిరుపతి రాథోడ్ గ్యాంగ్ నకిలీ పత్రాలు సృష్టించారు. పరమేశ్ తమకు జీపీఏ చేసినట్టు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేశారు. 20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొమ్మని లేకుంటే భూమి దక్కదని బెదిరించడంతో మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి తిరుపతి రాథోడ్ తో పాటు దేవేందర్ రెడ్డి, రవిగౌడ్, దుర్గాప్రసాద్, సుబ్బారావును అరెస్ట్ చేశారు. నిందుతులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.