పెట్రోల్ బంక్లో నకిలీ నోటు కలకలం

పెట్రోల్ బంక్లో నకిలీ నోటు కలకలం

మంచిర్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ హెచ్​పీ పెట్రోల్ బంక్​లో నకిలీ నోటు కలకలం రేగింది. నాయకిని పోశం అనే వ్యక్తి కారులో రూ.వెయ్యి పెట్రోల్​ పోయించుకొని రూ.2 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగతా బ్యాలెన్స్ రూ.వెయ్యి రిటర్న్​ ఇచ్చారు.

ఇందులో రూ.200 నోటును వైన్స్​లో ఇవ్వగా అది నకిలీ నోటుగా అనుమానించారు. దానిని తడిపి చూడగా కలర్ పోయింది. పోశం పెట్రోల్​ బంక్​కు వెళ్లి అడిగితే తమకు ఏమీ తెలియదని, ఆ నోటును వేరే కస్టమర్ ఇచ్చాడని తెలిపారు. మీరేం చేస్తారో చేసుకోండని బంక్​లో పనిచేస్తున్న వారు అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.