ఏడు డిఫరెంట్ లుక్స్‌‌‌‌‌‌‌‌లో నాగశౌర్య

ఏడు డిఫరెంట్ లుక్స్‌‌‌‌‌‌‌‌లో నాగశౌర్య

నాగశౌర్య, మాళవిక నాయర్‌‌‌‌‌‌‌‌ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ కలిసి నిర్మించిన ఈ మూవీ మార్చి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు.  నాగశౌర్య మాట్లాడుతూ ‘కొన్ని సినిమాలకు ప్రమోషన్స్ అవసరం లేదు. వాటంతటే అవే ప్రమోట్ అవుతాయి. అలాంటి సినిమాల్లో ఇది నిలుస్తుంది. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారు. ఇందులో ఏడు డిఫరెంట్ లుక్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాను.

ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద తర్వాత శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కి, నాకు గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అన్నాడు. ‘నా హార్ట్‌‌‌‌‌‌‌‌కి దగ్గరైన సినిమా. చాలా ఎక్సయిటెడ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా’ అంది మాళవిక. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పర్సనల్‌‌‌‌‌‌‌‌గా నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. మ్యూజిక్‌‌‌‌‌‌‌‌కి ఇప్పటికే మంచి పేరొచ్చింది.  నాకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, దాసరి ప్రసాద్ మాట్లాడుతూ ‘నాగశౌర్య, మాళవిక నాయర్..  సంజయ్, అనుపమ పాత్రల్లో ఆకట్టుకుంటారు. సినిమా చాలా సహజంగా ఉంటుంది. శ్రీనివాస్ అవసరాల ఎమోషన్స్ బాగా చూపించారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.