
- గైర్హాజరు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రెగ్యులర్గా డ్యూటీలు చేయాలని, నాగాలు చేస్తే ఉద్యోగ భద్రత ఉండదని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్ హెచ్చరించారు. మంగళవారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో కాసిపేట1, కాసిపేట2 బొగ్గు గనుల్లో కనీసం 100 మస్టర్లు చేయని ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించింది. హాజరైన జీఎం మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ మైన్లలో హాజరు శాతాన్ని పెంచి సంస్థ అభివృద్ధి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గతంలో బొగ్గు గనుల్లో పనులు కష్టంగా ఉండేవని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో ఈజీ అయ్యిందన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు రావడం అదృష్టమన్నారు. నాగాలు లేకుండా రెగ్యులర్గా డ్యూటీలు చేయాలని, ప్రతి నెలా 20 మస్టర్లు తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా 74 మంది గైర్హాజరు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ఇచ్చారు. ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్, ఏఐటీయూసీ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్రమేశ్, సింగరేణి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.