
చెన్నై : ఆటో ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఇవాళ తమిళనాడులోని థేని దగ్గర జరిగింది. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మధురైలోని నల్లతేవనపట్టికి ఇద్దరు భార్యాభర్తలు తమ పిల్లలు, అత్తతో కలిసి ఆటోలో వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో స్పీడ్ గా వెళ్తూ.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయాడు. ఇంతలోనే RTC బస్సు ఆటోను ఢీకొట్టడంతో.. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప గాయాలపాలైన ఆటో డ్రైవర్ అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. మృతులను కే. సేంద్రయన్(47), భార్య సుధా(35), కుమారుడు మణికందన్(9), కుమార్తె అభినయ(7)గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని సేంద్రయన్ అత్తగా గుర్తించారు పోలీసులు. థేని మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.