పాపులర్ మెజీషియన్ రాయ్​హార్న్.. కరోనాతో మృతి

పాపులర్ మెజీషియన్ రాయ్​హార్న్.. కరోనాతో మృతి

లాస్​వెగాస్​: ప్రముఖ మెజీషియన్ రాయ్ హార్న్(75) కరోనా వైరస్ తో చనిపోయారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో చాలా పాపులర్ అయిన రాయ్.. తన మేజిక్ షోలతో ప్రజాదరణ పొందారు. సీగ్ ఫ్రైడ్ అనే మరో వ్యక్తితో కలిసి రాయ్ తెల్ల పులులు, సింహాలు, ఇతర జంతువులతో రకరకాల స్టంట్లు చేసేవారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచీ అడవి జంతువుల ప్రేమికుడయిన రాయ్ తన ఫ్రెండ్ ఫ్రైడ్ తో కలిసి 1967 లో కెరీర్ ప్రాంరంభించారు. లాస్ వెగాస్‌లోని మిరాజ్ హోటల్​లో వీరిద్దరి షోలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉండేది. అలా 14 ఏళ్ల పాటు షోలు నిర్వహించిన రాయ్ 2003లో ఓ తెల్లపులి దాడిలో గాయపడ్డాడు. అప్పటినుంచి మ్యాజిక్ షోలు మానేశాడు. ఈ మధ్యే రాయ్ అనారోగ్యానికి గురికావడంతో కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. లాస్ వెగాస్ లోని ఓ ఆస్పత్రిలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.