ఫేమస్ సింగర్ ఆశా భోంస్లే లైవ్ కచేరీ.. ఎప్పుడో తెలుసా?

ఫేమస్ సింగర్ ఆశా భోంస్లే లైవ్ కచేరీ.. ఎప్పుడో తెలుసా?

ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే(Asha Bhosle)  నార్త్ లోనే కాదు, సౌత్ లో తన పాటలతో ఆకట్టుకున్నారు. వచ్చే నెల (సెప్టెంబర్ 8న) తన 90వ బర్త్ డే వేడుకలను దుబాయ్‌లో స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయనున్నారట. ఈ ప్రోగ్రాంలో తన సాంగ్స్ లో కొన్ని పాడుటకు రానున్నారని టాక్. కచేరీ.. ఆషా@90 లైవ్ పేరుతో దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖులు ఈ ప్రోగ్రాం కు అటెండ్ అవ్వునున్నారని తెలుస్తోంది. 

ఆశా భోంస్లే ఇండియాలో ఫేమస్ సింగర్స్ లలో ఒకరు. ఆమె ఎనిమిది దశాబ్దాల పాటు వివిధ భాషలలో 12,000 పాటలను పాడింది. దీంతో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2000), పద్మవిభూషణ్(2008) అవార్డు సైతం ఆమెను వరించింది. ఆశా భోంస్లే దివంగత నేపథ్య గాయని భారతరత్న అవార్డు పొందిన లతా మంగేష్కర్ సిస్టర్ కావడం విశేషం. 

ఆశా భోంస్లే చిన్న బడ్జెట్ మూవీస్ తో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.ఇప్పుడు బాలీవుడ్ లో హిందీ మూవీస్ లో గొప్ప హిట్‌ మూవీస్ కు తన గాత్రాన్ని అందించడంలో టాప్ సింగర్స్ లో ఒకరుగా ఉంది. 

ఆశా భోంస్లే తెలుగులో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన.. పాలు-నీళ్లు మూవీలో ఫస్ట్ టైం సింగర్ గా పరిచయమయ్యారు. 
ఇది మౌనగీతం..ఒక మూగరాగం..అంటూ మ్యూజిక్ డైరెక్టర్ సత్యం స్వరకల్పనలో రూపొందిన ఈ గీతం అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత చిన్నికృష్ణుడు, పవిత్రబంధం, చందమామ చిత్రాల్లోనూ ఆశా భోస్లే నోట తెలుగు పాటలు పాడి ఎంతో ఫేమస్ అయ్యారు. .

చివరిగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన చందమామ మూవీలో కె.ఎమ్.రాధాకృష్ణన్ మ్యూజిక్ డైరెక్షన్ లో.. నాలో ఊహలకు..నాలో ఊసులకు..సాంగ్ పాడి తెలుగు ఆడియన్స్ కు ఎంతో దగ్గరయ్యారు ఆశా భోంస్లే. 

ఇప్పటికే రెండు నేషనల్ అవార్డ్స్,18 మహారాష్ట్ర స్టేట్ ఫిలిం ఫేర్ అవార్డ్స్..రెండు గ్రామీ నామినేషన్‌లతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. ఆశా భోంస్లే..O.P. నయ్యర్, ఖయ్యామ్, శంకర్-జైకిషన్, R.D. బర్మన్ వంటి వివిధ తరాలకు చెందిన సంగీత దర్శకుల శ్రేణితో పనిచేశారు,అలాగే A.R. రెహమాన్, ఇళయరాజా, ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు.