రామ్‌ చరణ్‌ కారును వెంబడించిన ఫ్యాన్స్.. కారు అద్దం దింపి ఏంచేశాడో తెలుసా!

రామ్‌ చరణ్‌ కారును వెంబడించిన ఫ్యాన్స్.. కారు అద్దం దింపి ఏంచేశాడో తెలుసా!

మాములుగా సినిమా స్టార్స్ అంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది వాళ్ళ ఫేవరేట్ హీరో కనిపెడితే వదిలిపెడతారా? సరిగా ఇలాంటి సంఘటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు ఎదురైంది. రామ్ చరణ్ కారులో వెళుతున్న సంగతి గమనించిన ఆయన ఫ్యాన్స్ కొంత దూరం వరకు ఆయన కారుని వెంబడించారు. అది గమనించిన రామ్ చరణ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదెరాబాద్ లోనే జరుగుతోంది. ఆ షూటింగ్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నారు. అదేవిదంగా నిన్న(జనవరి 19) కూడా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్.. షూటింగ్ అనంతరం కారులో ఇంటికి బయల్దేరారు. లొకేషన్ నుండి బయటకు వచ్చే వరకు ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఆయన కారు బయటకు రాగానే బైక్ లపై ఆయన కారును కొంతదూరం వరకు వెంబడించారు.

అది గమనించిన చరణ్ కారు గ్లాసును కిందకు దించి.. వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. కారును కూడా స్పీడ్ గా పోనివ్వకుండా.. స్లో చేసి వారికి కనబడేలా కారు అద్దాన్ని కిందకు దించి వారికి ఆనందాన్ని కలిగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనని చూడటానికి వచ్చిన అభిమానుల పట్ల రామ్ చరణ్ ప్రవర్తన చూసి ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.