IND vs AFG, 3rd T20I: వికెట్లేమీ లేవు.. చేసింది ఒకే పరుగు..దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

IND vs AFG, 3rd T20I: వికెట్లేమీ లేవు.. చేసింది ఒకే పరుగు..దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

శివమ్ దూబే.. ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ ల్లో శివాలెత్తాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఆల్ రౌండర్ అంచనాలకు మించి రాణించాడు. నిన్న బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో మాత్రం దూబే విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో 6 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి  ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  బౌలింగ్ లో రెండు ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకున్నాడు. నిన్న దూబే రోజు కాదని స్పష్టంగా అర్ధమవుతుంది. అయినా దూబేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. 

సెంచరీతో భారత్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన రోహిత్ కు కాకుండా.. ఒక్క పరుగు చేసి, వికెట్లేమీ తీయని ఒక ప్లేయర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎలా ఇస్తారు అని ఆశ్చర్యపోకండి. తొలి మ్యాచ్ లో  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు (POTM) ఈ సిరీస్ లో మొత్తం 124 పరుగులు, 2 వికెట్లతో దూబే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. పోస్ట్-మ్యాచ్ ప్రదర్శన సమయంలో కొంత గందరగోళం జరిగింది. వ్యాఖ్యాత మురళీ కార్తీక్ పొరపాటున ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కి బదులుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తీసుకోవాల్సిందిగా ఆహ్వానించారు.  

ఇంతలో 30 ఏళ్ల ఈ అల్ రౌండర్ కేవలం 1 పరుగు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎలా గెలిచాడో తెలియక అయోమయంలో పడ్డాడు. వెంటనే కార్తీక్ తన తప్పును గ్రహించి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకోమని దూబేని కోరాడు. ఈ సీన్ తో కాసేపు అక్కడ నవ్వులు కురిశాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ రెండో సూపర్ ఓవర్ లో గెలిచింది. 69 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్‌‌‌‌‌‌‌‌ పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూపర్ ఓవర్ లో కూడా రాణించి   భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.