ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌‌పై దాడి.. ఆసిఫాబాద్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లో ఘటన

ఫారెస్ట్ బీట్  ఆఫీసర్‌‌పై దాడి.. ఆసిఫాబాద్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్(టి) మండలం డోర్‌‌పల్లి  గ్రామ సమీపంలోని రిజర్వ్  ఫారెస్ట్ లో ట్రాక్టర్ తో దున్నుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్  బీట్  ఆఫీసర్ పై రైతు దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.

 సిర్పూర్(టి) రేంజ్  పరిధిలోని ముత్యంపేట బీట్ లో దుర్యోధన్  అనే రైతు ట్రాక్టర్‌‌తో పోడు భూమిని దున్నుతుండగా, బీట్ ఆఫీసర్  భూమేశ్వర్  అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా, దుర్యోధన్  వెదురు బొంగుతో బీట్ ఆఫీసర్‌‌పై దాడి చేశాడు. 

భూమేశ్వర్ కు గాయలవగా, చికిత్స కోసం సిర్పూర్(టి) సివిల్  హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.