జన్నారం, వెలుగు: రుణ మాఫీ కాలేదని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన జక్కుల లచ్చన్న(55) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ లిస్టులో తన పేరు లేకపోవడంతో, శనివారం గ్రామంలోని పాత గ్రామపంచాయితీ ఆఫీస్ ఎదుట పురుగు మందు డబ్బా పట్టుకొని తాగే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మరో రైతు లచ్చన్న చేతిలోని పురుగు మందు డబ్బాను లాక్కొని సముదాయించి ఇంటికి తీసుకెళ్లాడు.
