సెల్ టవర్ ఎక్కి రైతు బలవన్మరణం

సెల్ టవర్ ఎక్కి రైతు బలవన్మరణం

లింగంపేట, వెలుగు : తనకున్న కొద్దిపాటి పొలంలో చెరువు నీళ్లు పారుతున్నయి. పంటలు పండుతలేవు.. రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు, గ్రామ పెద్దలకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నడు. ఎక్కడికెళ్లినా న్యాయం జరగడం లేదని మనోవేదనకు గురైండు. దీంతో సెల్ టవర్ ఎక్కి ఉరేసుకున్నడో యువ రైతు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారంలో సోమవారం జరిగిందీ ఘటన. పుట్ట ఆంజనేయులు(28)కు మెంగారం గ్రామ శివారులోని చెరువు ముందు 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. చెరువు కింద అర గుంట భూమి ఉంది. నీళ్లు పారుతుండటంతో దశాబ్ద కాలంగా చెరువు కింద ఉన్న భూమిలో ఎలాంటి పంటను సాగుచేయడం లేదు. చెరువు కింద ఉన్న భూములకు నీటిని విడుదల చేసిన సమయంలో తన పొలంలో నీరు నిలుస్తున్నది. దాంతో తన పొలంలో నుంచి నీటిని పోనీయకుండా ఆంజనేయులు అడ్డుకునేవాడు. దీనిపై రెండేండ్ల కిందట గ్రామ రైతులు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయగా అప్పటి తహసీల్దార్ అమీన్​సింగ్, ఎస్ఐ శ్రీకాంత్.. ఆంజనేయులుకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దాంతో సమస్య సద్దుమణిగింది. సోమవారం మధ్యాహ్నం ఆంజనేయులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మారుతి, ఎస్ఐ శంకర్.. అక్కడికి చేరుకుని ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆంజనేయులుతో మాట్లాడారు. టవర్ దిగి రావాలని బతిమాలారు. పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో మొద్దుబారి బండరాయిగా మారిన వ్యవస్థల దుర్మార్గానికి ఈ ఘటన నిదర్శనమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.

డాడీ.. కిందికి దిగు

సెల్ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి ఎక్కిన ఆంజనేయులును కిందకు దిగాలని అతడి కుమార్తెలు అవంతి, శ్రీవర్షిణిలు ఏడుస్తూ బతిమిలాడారు. ‘డాడీ.. నీవు కిందకు దిగు డాడీ’ అంటూ పిల్లలు అరవడం చూపరులను  కంటతడిపెట్టించింది. పిల్లలతో పాటు అతడి భార్య సుజాత, గ్రామస్థులు ఎంత చెప్పినా ఆంజనేయులు వినలేదు. టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని పోస్టు మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కాగా, ఆంజనేయులు  కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే సురేందర్ చెప్పారు. అతడి ముగ్గురు పిల్లలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.