
లింగాల, వెలుగు : వాగులో కొట్టుకుపోయి రైతు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. లింగాల మండల కేంద్రానికి చెందిన మూడావత్ పెంట్యా నాయక్ (65) గురువారం పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం పొలానికి వెళ్లే దారిలోని వాగు కాల్వలో కొద్ది దూరంలో పెంట్యానాయక్ బాడీ పైకి తేలి కనిపించింది. కుటుంబ సభ్యులు బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. పెంట్యానాయక్ కు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు.