మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో 108లో ఆక్సిజన్‌‌ అందక రైతు మృతి

మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో 108లో ఆక్సిజన్‌‌ అందక రైతు మృతి

పాలమూరు, వెలుగు : 108లో ఆక్సిజన్‌‌ అందక రైతు చనిపోయాడు. మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా నిజాలాపూర్‌‌ గ్రామానికి చెందిన బుజ్జయ్య (60) శ్వాస అందక ఇబ్బంది పడుతుండడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా... జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. 108లో   తీసుకెళ్తుండగా ఆక్సిజన్ పెట్టాలని కుటుంబ సభ్యులు కోరారు.

అయితే సిలిండర్ ప్రాబ్లమ్ ఉందని, టెక్నీషియన్ కూడా అందుబాటులో లేడని 108 సిబ్బంది  చెప్పారు. ఈ క్రమంలో అన్నాసాగర్ వద్దకు రాగానే బుజ్జయ్య చనిపోయాడు. దీంతో అంబులెన్స్‌‌లో ఆక్సిజన్‌‌ అందకపోవడం వల్లే బుజ్జయ్య చనిపోయాడంటూ అతడి కుమారులు ప్రభుత్వ హాస్పిటల్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు.