మాస్టర్ ప్లాన్లో భూమి పోతదని రైతు ఆత్మహత్యాయత్నం

మాస్టర్ ప్లాన్లో భూమి పోతదని రైతు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగిల్చిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు కోల్పోతామన్న భయంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ అనే రైతు పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు అతన్ని వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.