రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి/ కామేపల్లి, వెలుగు: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో, కొండాయిగూడెం, కామేపల్లి సహకార సంఘాలల్లో రైతులకు సబ్సిడీపై జీలుగు, జనుములు, పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. 

టేకులపల్లి మండలంలోని రామచంద్రునిపేట, ఎర్రయిగూడెం, పెట్రాంచెలక గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు ఆయన హాజరై ప్రారంభించారు. అనంతరం రామచంద్రునిపేట, కామేపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్​ కమిషన్​డైరెక్టర్​ రామ్​రెడ్డి గోపాల్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ మల్లిబాబు యాదవ్, సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.