వరికి డ్రోన్లతో పిచికారీపై రైతులకు అవగాహన

 వరికి డ్రోన్లతో పిచికారీపై రైతులకు అవగాహన

తిర్యాణి,వెలుగు: డ్రోన్లు రైతులకు మేలు చేస్తాయని, కూలీల కొరత తీరుతుందని సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ రత్నాకర్, ఏవో తిరుమలేశ్వర్ చెప్పారు. శుక్రవారం మండలంలోని తెలండి గ్రామంలో నేషనల్ వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్, సేవ స్ఫూర్తి ఫౌండేషన్ సహకారం అగ్రికల్చర్ ఆధ్వర్యంలో వరి పంటకు డ్రోన్లతో మందులు పిచికారీ చేయడం పై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉపసర్పంచ్ లక్ష్మి, పీఏసీఎస్​ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎస్సై రమేశ్, ఏఈఓ ముత్తయ్య పాల్గొన్నారు.