తుమ్మిళ్ల నుంచి సాగునీరు అందించండి .. ఎమ్మెల్సీ చల్లాకు రైతుల వినతి

తుమ్మిళ్ల నుంచి సాగునీరు అందించండి .. ఎమ్మెల్సీ చల్లాకు రైతుల వినతి

మానవపాడు, వెలుగు: ఖరీఫ్  సీజన్​లో సాగు చేసిన మిర్చి పంటలు ఎండిపోతన్నాయని, తుమ్మిళ్ల నుంచి సాగునీటిని అందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని రైతులు కోరారు. ఆదివారం మండలంలోని పెద్ద పోతులపాడు గ్రామంలో మానవపాడు  రైతులు ఎమ్మెల్సీతో మాట్లాడారు. తుమ్మిళ్ల  పంప్​ దగ్గర నీరు లేకపోవడంతో పంపులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. నీటిని రిలీజ్​ చేసి తుమ్మిళ్ల పంపులు ఆన్  చేసేలా చూడాలని, లేదంటే పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ, తెలంగాణ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సాగునీరు అందేలా చూస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. గోపాల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, దామోదర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రకాశం గౌడ్  పాల్గొన్నారు. 15 రోజుల కింద హార్ట్​ఎటాక్​తో  పెద్దపోతులపాడు సర్పంచ్  పరిమిల భాస్కర్ రెడ్డి కొడుకు చనిపోగా, ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు.