ఆదిలాబాద్ జిల్లాలో పొలాల పండుగ సంబురం

ఆదిలాబాద్ జిల్లాలో పొలాల పండుగ సంబురం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో శనివారం పొలాల పండుగను రైతులు సంబురంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించారు. డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. 

అనంతరం ఇంటికి తోలుకుని వెళ్లి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పొలాల పండుగ రోజున ఎద్దులను పూజించి నైవేద్యం పెట్టిన తర్వాతే కుటుంబమంతా ఉపవాస దీక్ష వీడవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. పొలాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది.    - వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్