నకిలీ విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన

నకిలీ విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన

బీర్కూర్​, వెలుగు:  బీర్కూర్​ కు చెందిన ‘మన గ్రోమోర్​’ లో తమకు నకిలీ విత్తనాలు ఇచ్చారని  మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు మంగళవారం ఆందోళన చేశారు.  రైతులు రెడ్డి నర్సింలు, ఆర్య దిలీప్​, అనిల్​  మాట్లాడుతూ.. గ్రోమోర్​ లో ఇచ్చిన విత్తనాల వల్ల పొలంలోవడ్ల గింజలకు బదులు.. పొల్లు వచ్చిందన్నారు. తాము నష్టపోయామని అగ్రికల్చర్​ ఆఫీసర్లకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.

ఈ విషయమై ఏఓ కమల మాట్లాడుతూ..  రైతుల సమస్య తమ దృష్టికి వచ్చిందని,  మంగళవారం  పొలాలను పరిశీలించామని తెలిపారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.