రైతులు వడ్లను తక్కువ ధరకు అమ్ముకోవద్దు

రైతులు వడ్లను తక్కువ ధరకు అమ్ముకోవద్దు

యాసంగి వడ్ల కొనుగోలుకు ఇబ్బందుల్లేకుండా అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  రైతులు బ్రోకర్లకు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దన్నారు. అంతేకాదు..గన్నీ సంచులు, హమాలీలు, ట్రాన్స్ పోర్టు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ నిర్వాహకులు, ఐకేపీ సెంటర్ల మహిళలు, ఇతర సిబ్బంది, నాయకులు పర్యవేక్షించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున రైతులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఏ మాత్రం కరోనా లక్షణాలున్నా దగ్గరున్న ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. సన్నవడ్లకు అదృష్టవశాత్తు మంచి ధర వస్తోందన్నారు. రూ.2100 వరకు క్వింటాళ్ ధర పలుకుతోందని తెలిపారు మంత్రి ఈటల.