రైతు ఐదుగురు బిడ్డలు గ్రూప్-1 అధికారులే 

V6 Velugu Posted on Jul 15, 2021

రాజస్థాన్‌లో ఓ రైతుకు చెందిన ఐదుగురు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. హనుమాన్‌గఢ్‌కు చెందిన సహదేవ్ సహరన్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. రైతు అయినప్పటికీ ఆయన తన కుమార్తెలందరినీ చదివించాడు. ఇప్పుడా ఐదుగురు కుమార్తెలు రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నతోద్యాగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కొన్నిరోజుల కిందటే రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో సహదేవ్ కుమార్తెలు అన్షు, రీతు, సుమన్ అధికారులుగా ఎంపికయ్యారు. సహదేవ్ మరో ఇద్దరు కుమార్తెలు రోమా,మంజు ఇప్పటికే RAS అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్స్ తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 తో సమానం.

రైతు బిడ్డలైన ఈ ఐదుగురు అమ్మాయిలు RAS సాధించడం.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఎంతో మందికి ఆదర్శమంటున్నారు నెటిజన్లు.

Tagged rajasthan, farmers five daughters, Group-1 officers, RAS, Hanumangarh

Latest Videos

Subscribe Now

More News