పోడు భూముల కోసం 2  గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

పోడు భూముల కోసం 2  గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

మంచిర్యాల జిల్లా: పోడు భూముల కోసం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సోమేనపల్లి, నెన్నల మండలం కొనంపేట గ్రామాల మహిళా రైతులు ఘర్షణకు దిగారు. కారం పొట్లాలు వెంట తెచ్చుకుని వాగ్వాదానికి దిగిన మహిళా రైతులు పరస్పరం తోసుకున్నారు. కారం చల్లుకుంటూ పరస్పరం దాడులకు దిగారు.

రెండు గ్రామాల రైతులు పొలాల వద్ద గుంపులు గుంపులుగా గుమిగూడిన రైతులు ఇవాళ అటో ఇటో తేలిపోవాలంటూ వాగ్వాదానికి దిగారు. ఒకదశలో అరుపులు, కేకలు తప్ప ఏమీ వినిపించని పరిస్థితి ఏర్పడింది. వాగ్వాదం శృతి మించి ఎదుటి వారిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ కారంపొడి చల్లుకుంటూ తోసేసుకోగా.. మరికొందరు చేతికందిన కర్రలు తీసుకుని దాడికి పాల్పడ్డారు.

రెండు గ్రామాల మహిళా రైతుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో  20 మందికి పైగా గాయపడ్డారు. ఘర్షణ అనంతరం ఇరు గ్రామాల పోడు రైతులు పోలీసు స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.