ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం

ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం

వెల్దుర్తి, వెలుగు: మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట గ్రామ శివారులో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతులు అభ్యంతరం తెలిపారు. కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమిని సోమవారం అడిషనల్​కలెక్టర్ వెంకటేశ్వర్లు, తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి  పరిశీలించారు. ఈ సందర్భంగా రామంతపూర్, హకీంపేట, అచ్చంపేట గ్రామ శివారులో భూములను పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఫార్మా  కంపెనీ ఏర్పాటు చేస్తే అందులోనుంచి వెలువడే కాలుష్య జలాలు, రసాయన వ్యర్థాల వల్ల  ఆరోగ్యాలు, పంట పొలాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేస్తే  ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి హెచ్చరించారు. తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఆర్ఐ ధన్ సింగ్, పొల్యూషన్​ కంట్రోల్​బోర్డ్​అధికారులు ఉన్నారు.